టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం: విచారణకు హాజరైన తనీశ్
- ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులను విచారించిన అధికారులు
- నేడు తనీశ్ బ్యాంకు ఖాతాల పరిశీలన
- డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలపై ఆరా
ఈ కేసులో నోటీసులు అందుకున్న నేపథ్యంలో తనీశ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు. ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులతో తనీశ్‌కు ఉన్న సంబంధాలు, జరిపిన సంప్రదింపులపై విచారిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.