'నేనేనా?' నుంచి ఉత్కంఠను రేకెత్తిస్తున్న ట్రైలర్!
- మిస్టరీ థ్రిల్లర్ గా 'నేనేనా?'
- ప్రధానమైన పాత్రలో రెజీనా
- ముఖ్యమైన పాత్రలో అక్షర గౌడ
- తమిళ టైటిల్ గా 'సూర్పనగై'
ప్రస్తుతం జరుగుతున్న ఒక మర్డర్ కేసు విచారణ .. 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఆ సంఘటన ఏమిటి? ఆ కేసును ఎలా ఛేదించారు? అనేదే కథ అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతంలోను .. గతంలోనూ రెజీనా వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ ను తమిళంలో 'సూర్పనగై' పేరుతో విడుదల చేయనున్నారు. నాయిక ప్రధానమైన ఈ సినిమాతో రెజీనా మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి.