తన బయోపిక్ లో తన పాత్రను ఎవరు చేయాలని జయలలిత కోరుకున్నారో తెలుసా?
- తన పాత్రను ఐశ్వర్య రాయ్ చేయాలని జయ అనుకున్నారన్న సిమి గరేవాల్
- అయితే కంగన అద్భుతంగా నటించిందని కితాబు
- ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి ఒదిగిపోయారని వ్యాఖ్య
అయినప్పటికీ ఈ చిత్రంలో జయలలిత పాత్రలో కంగన అద్భుతంగా నటించిందని సిమి గరేవాల్ కొనియాడారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత జయ పాత్రకు కంగన పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చిందని మనస్పూర్తిగా చెపుతున్నానని అన్నారు. కంగన చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు తాను మద్దతు పలకనని... అయితే ఆమె నటనా ప్రతిభను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేనని చెప్పారు. ఎంజీఆర్ పాత్రకు అరవిందస్వామి ప్రాణప్రతిష్ట చేశారని కొనియాడారు.