రమ్య తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చిన హోంమంత్రి... అక్కున చేర్చుకుని ఓదార్చిన సీఎం జగన్
- ఇటీవల బీటెక్ విద్యార్థిని రమ్య హత్య
- ఇప్పటికే 10 లక్షల సాయం అందించిన సర్కారు
- తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్
- రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగం
- రమ్య కుటుంబానికి పొలం, ఇంటి స్థలం
రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మరో 10 రోజుల్లో ఆమెకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందాలని, వారి కుటుంబం తనతో కలిసి సంతోషంగా టీ తాగాలని నిర్దేశించారు. అంతేకాకుండా రమ్య కుటుంబానికి ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల ఇంటి స్థలం కూడా ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు హోంమంత్రి సుచరిత మీడియాకు వివరాలు తెలిపారు.
రమ్య హత్య జరిగిన తర్వాత ఆమె కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చెక్ ను కూడా ప్రభుత్వం అందించింది.