ఒక్కరోజులో 3.71 బిలియన్ డాలర్లు పెరిగిన ముఖేశ్ అంబానీ సంపద
- రిలయన్స్ షేర్ల దూకుడు
- సెప్టెంబరు 3న భారీగా పెరిగిన సంపద
- 92.6 బిలియన్ డాలర్లకు చేరిన నికర ఆస్తి
- ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానంలో అంబానీ
రిలయన్స్ షేర్ల ధరలు భారీగా పెరగడంతో అంబానీ సంపద అమాంతం పెరిగినట్టు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇదే ఒరవడి కొనసాగిస్తే త్వరలోనే అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.