గోవా వెళుతున్న 'లైగర్' టీమ్!
- 'గోవా'లో విజయ్ దేవరకొండ
- ఈ నెల చివరి వరకూ యాక్షన్ సీన్స్
- చివరి షెడ్యూల్ విదేశాల్లో
- కీలక పాత్రలో రమ్యకృష్ణ
కానీ కరోనా కారణంగా కుదరలేదు. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో, ఈ సినిమా షూటింగును 'గోవా'లో ప్లాన్ చేశారు. వచ్చేవారం ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది. ఈ నెలంతా కూడా విజయ్ దేవరకొండపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
ఇక ఆ తరువాత షెడ్యూల్ ను విదేశాల్లో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. విదేశీ ఫైటర్లతో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారని అంటున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. కథానాయికగా అనన్య పాండే తెలుగు తెరకి పరిచయమవుతోంది.