'వలిమై' వచ్చేది అప్పుడేనట!
- అజిత్ నుంచి 'వలిమై'
- యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా హుమా ఖురేషి
- డిసెంబర్ లో విడుదల
కానీ ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగానే సన్నాహాలు చేసుకుంటున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. అజిత్ కొంతకాలంగా వరుస విజయాలతో ఉన్నాడు. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ అంతకుమించి అన్నట్టుగా ఉంటాయట.