దూసుకుపోతున్న 'టక్ జగదీష్' ట్రైలర్!
- నాని హీరోగా 'టక్ జగదీష్'
- శివ నిర్వాణతో రెండో సినిమా
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
- ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో
ఈ ట్రైలర్ ఇంతవరకూ 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను .. 168K ప్లస్ లైక్స్ ను సొంతం చేసుకుంది. నాని కెరియర్ లోనే ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వ్యూస్ ను, లైక్స్ ను సంపాదించుకున్న ట్రైలర్ ఇదేనని అంటున్నారు. కొత్త రికార్డుల దిశగా ఈ ట్రైలర్ దూసుకెళ్లడం ఖాయమని చెప్పుకుంటున్నారు. నాని సరసన నాయికగా రీతూ వర్మ నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.