మూడు డిఫరెంట్ లుక్స్ తో చైతూ!
- విడుదలకి సిద్ధమైన 'లవ్ స్టోరీ'
- షూటింగు దశలో 'థ్యాంక్యూ'
- దర్శకుడిగా విక్రమ్ కుమార్
- సెట్స్ పైకి వెళ్లిన 'బంగార్రాజు'
ఈ సినిమాలో చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో చైతూ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు. అంటే వయసు పరంగా ఆయన మూడు దశలలో కనిపిస్తాడని చెబుతున్నారు. గతంలో ఈ తరహా పాత్రలను ఆయన 'ప్రేమమ్' సినిమాలో పోషించాడు.
మరి ఆ పాత్రలకు .. ఈ పాత్రలకు మధ్య వైవిధ్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక చైతూ తాజా చిత్రంగా త్వరలో 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా 'బంగార్రాజు' సినిమా షూటింగులోను ఆయన జాయినైన సంగతి తెలిసిందే.