చెల్లెళ్లతో కలిసి నగరంలో సందడి చేసిన రామ్ చరణ్... ఫొటోలు వైరల్
- రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి
- సరదాగా చెల్లెళ్లతో లంచ్ కోసం బయటకు వచ్చిన చరణ్
- మెగాస్టార్ పుట్టినరోజున కూడా కలుసుకున్న అన్నాచెల్లెళ్లు
జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ అలియా భట్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ తెర పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. కాగా, నిహారిక చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రంలో అలా మెరిశారు. ప్రస్తుతం ఆమె ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ పుట్టినరోజు జరుపుకోవడం కోసం వీళ్లంతా చిరంజీవి ఇంట్లో కలుసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు తీసిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
