1 మిలియన్ కి పైగా లైక్స్ తో మహేశ్ బర్త్ డే బ్లాస్టర్!
- గోవా షెడ్యూల్ పూర్తిచేసిన మహేశ్
- తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
- బర్త్ డే బ్లాస్టర్ దూకుడు తగ్గలేదు
- 35 మిలియన్స్ కి పైగా వ్యూస్
- జనవరి 13వ తేదీన సినిమా విడుదల
ఈ టీజర్ ను యూ ట్యూబ్ లో వదిలిన దగ్గర నుంచి ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. పాత రికార్డులను చెరిపేస్తూ, కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా 35 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను .. 1 మిలియన్ కి పైగా లైక్స్ ను రాబట్టింది. ఈ టీజర్ జోరు ఈ సినిమా యూనిట్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.
మహేశ్ బాబు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. యాక్షన్ తో పాటు కామెడీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. వెన్నెల కిషోర్ - సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. 'సంక్రాంతి' కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.