టిడ్కో ఇళ్లు, పథకాలపై లోకేశ్ కు అవగాహన లేదు: బొత్స సత్యనారాయణ
- బీసీల స్థితిగతులను మార్చేందుకు ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నాం
- మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం
- టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీలపై సీఎం సమీక్ష నిర్వహించారు
మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స మరోసారి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని చెప్పారు. అమరావతి పిటిషన్లపై రోజువారీ విచారణ అన్నప్పుడు పిటిషనర్లే వాయిదా అడగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల కేటాయింపులు, జగనన్న కాలనీల నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారని, పనులను వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు.