నాలుగు నెలల్లో రూ. 900 కోట్లు నష్టపోయిన టీఎస్ ఆర్టీసీ
- కరోనాకు తోడు పెరిగిన డీజిల్ ధరలతో నష్టాలు
- నెలకు రూ. 225 కోట్లు నష్టపోయిన ఆర్టీసీ
- ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విన్నపం
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు ఆర్టీసీకి రూ. 900 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. సగటున ప్రతి నెల ఆర్టీసీ రూ. 225 కోట్లు నష్టపోయింది. దీంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతోంది. వీలైనంత త్వరలో టికెట్ ధరలను పెంచి కొంతైనా ఆదుకోవాలని విన్నవిస్తోంది.