Megha Akash: 'డియర్ మేఘ' రిలీజ్ డేట్ ఖరారు!

Dear Megha movie release date confirmed

  • పరాజయాల వలన తగ్గిన అవకాశాలు  
  • విడుదలకి రెడీగా రెండు సినిమాలు
  • ఈ నెల 19న రానున్న 'రాజ రాజ చోర'
  • వచ్చేనెల 3న రానున్న 'డియర్ మేఘ'  


మేఘ ఆకాశ్ ప్రధాన పాత్రధారిగా 'డియర్ మేఘ' చిత్రం రూపొందింది. అర్జున్ దాస్యం నిర్మించిన ఈ సినిమాకి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే ఆయన తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు.

ఇది ఫీల్ తో కూడిన ప్రేమకథా చిత్రం. నాయిక జీవితాల్లోకి ప్రేమ పేరుతో ఒకరు ఎంటర్ కావడం .. కొన్ని పరిస్థితులు వారిని దూరం చేయడం .. మరొకరితో ఆమెకి పెళ్లి కుదరడం వంటి మలుపులతో ఈ కథ నడుస్తుంది. ఆమె ప్రేమ కోసం తపించే పాత్రల్లో అరుణ్ ఆదిత్ .. అర్జున్ సోమయాజుల కనిపించనున్నారు.

ఈ సినిమాకి హరి గౌర సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన బాణీలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఆరంభంలోనే పరాజయాలు ఎదురైన కారణంగా అవకాశాలకు దూరమైన మేఘ ఆకాశ్, ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

Megha Akash
Arun Adith
Arjun Somayajula
  • Loading...

More Telugu News