నారా లోకేశ్ పై పాత గుంటూరు పీఎస్ లో కేసు నమోదు
- గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య
- ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ నేతలు
- ఉద్రిక్తతల నడుమ లోకేశ్ అరెస్ట్
- నిన్న సాయంత్రానికి విడుదల
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అనంతరం ఆమె కుటుంబాన్ని లోకేశ్ సహా ఇతర టీడీపీ నేతలు నిన్న పరామర్శించేందుకు రాగా, తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా లోకేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, సాయంత్రానికి ఆయన్ను విడుదల చేశారు. లోకేశ్ కు 151 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.
రాజకీయ పక్షాల తీరు అభ్యంతరకరమంటూ వ్యాఖ్యానించిన ఇనార్జి డీఐజీ రాజశేఖర్, కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే లోకేశ్, తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో లోకేశ్ పై 341, 353, 147ఆర్/డబ్ల్యూ, 149ఆర్/డబ్ల్యూ, 120బి సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.