"జెండా ఎగరేస్తాం"... సింగిల్ లైన్ ట్వీట్ తో చర్చకు తెరలేపిన ప్రకాశ్ రాజ్
- వచ్చే నెలలో 'మా' అధ్యక్ష ఎన్నికలు
- బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు తదితరులు
- బలమైన పోటీదారుగా ఉన్న ప్రకాశ్ రాజ్
- ఏకగ్రీవం కోసం పలువురి ప్రయత్నాలు
'మా' అధ్యక్ష ఎన్నికలకు సమరశంఖం పూరించారా? లేక, రేపటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్య చేశారా? అనేది అస్పష్టంగా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అయితే, జెండా ఎగరేస్తామని ఆయన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది 'మా' ఎన్నికలను ఉద్దేశించిన కామెంటేనని అభిమానులు పేర్కొంటున్నారు. ప్రకాశ్ రాజ్ ఇటీవల చెన్నైలో ఓ తమిళ చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. దాంతో హైదరాబాదులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ గురవారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నారు.