పవన్ సినిమా నుంచి రానున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
- మలయాళ రీమేక్ షూటింగులో పవన్
- ఆయన సరసన నాయికగా నిత్యామీనన్
- రానా జోడీగా కనిపించనున్న ఐశ్వర్య రాజేశ్
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
అయితే రేపు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను వదులుతారా? లేదంటే మేకింగ్ వీడియో ఏదైనా రిలీజ్ చేస్తారా? అనేది అందరిలో ఉత్కంఠను పెంచుతోంది. ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రను రానా పోషిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే .. మాటలు అందించడం వలన సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.