'పెళ్లి సందD' టైటిల్ సాంగ్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- రోషన్ హీరోగా 'పెళ్లి సందD'
- కథానాయికగా శ్రీలీల పరిచయం
- ప్రత్యేక పాత్రలో రాఘవేంద్రరావు
- త్వరలోనే విడుదల
కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు, టైటిల్ సాంగ్ ను లిరికల్ వీడియోగా అందించనున్నారు. రోషన్ సరసన నాయికగా శ్రీలీల నటించింది. తెలుగులో ఆమెకి ఇది తొలి సినిమా.
ఇంతవరకూ రాఘవేంద్రరావు సినిమాలో భాగంగా ఎప్పుడూ తెరపై కనిపించలేదు. కానీ ఆయన తొలిసారిగా ఈ సినిమాలో 'వశిష్ఠ' అనే పాత్రలో కనిపించనున్నారు. నటుడిగా ఆయన తొలిసారి తెరపై కనిపించడం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.