మనసులు కొల్లగొట్టిన 'శ్రీదేవి సోడా సెంటర్' సాంగ్
- సుధీర్ బాబు జోడీగా ఆనంది
- తాజాగా మరో పాట విడుదల
- సిరివెన్నెల సాహిత్యం
- మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
'నాలో ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇది' అంటూ ఈ పాట సాగుతోంది. మణిశర్మ సంగీతానికి సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాటకి ప్రధానమైన బలం. కనుబొమలతో కబురంపినా .. మురిపాల మునక అంటూ తేలికైన పదాలతో సీతారామశాస్త్రి చేసిన ప్రయోగాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. దినకర్ - రమ్య బెహ్రా ఆలాపన ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట యూత్ హృదయాలను కొల్లగొట్టేలానే సాగుతోంది. 'పలాస 1978' సినిమాతో ప్రశంసలను అందుకున్న కరుణ కుమార్, ఆ తరువాత చేసిన సినిమా ఇదే. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.