సునీల్ ప్రధాన పాత్రలో 'కనబడుటలేదు'.. 13న విడుదల
- డిటెక్టివ్ పాత్రలో సునీల్
- దర్శకుడిగా బాలరాజు పరిచయం
- సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో కథ
- నిన్న ట్రైలర్ విడుదల
ఈ కేసు టేకప్ చేసిన వారు ఆ తరువాత అదృశ్యం కావడం, డిటెక్టివ్ రామకృష్ణను కలవరపెడుతుంది. దాంతో ఆయన ఆ కేసును ఎలా డీల్ చేయాలా అనే విషయంలో రకరకాల ఆలోచనలు చేయడం మొదలుపెడతాడు. ఆ కేసు పరిశోధనలో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే ఉత్కంఠ భరితమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ కలిపితీసినట్టుగా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు. స్పార్క్ సంస్థవారు నిర్మించిన ఈ సినిమాతో, దర్శకుడిగా బాలరాజు పరిచయమవుతున్నాడు. రవివర్మ .. ప్రవీణ్ .. కిరీటి ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎక్కువగా నూతన నటీనటులే కనిపిస్తున్నారు.