విడుదలకు రెడీ అవుతున్న 'బజార్ రౌడీ'
- రౌడీ పాత్రలో సంపూ
- కీలక పాత్రలో సాయాజీ షిండే
- దర్శకుడిగా వసంత నాగేశ్వరరావు
- ఈ నెల 20వ తేదీన రిలీజ్
వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రౌడీగా సంపూ నవ్వులు పూయించనున్నాడు. పాటలు .. ఫైట్లు .. డాన్సులు అన్నీ కూడా కామెడీకి ఎంత మాత్రం తగ్గకుండా ఉంటాయట. సంపూ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రమని చెబుతున్నారు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
గతంలో రాజేంద్రప్రసాద్ సినిమాలకు ఎక్కువగా సంభాషణలు అందించిన మరుధూరి రాజా ఈ సినిమాకి మాటలు రాశారు. ఆయన సంభాషణలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాలో, సాయాజీ షిండే .. పృథ్వీ .. నాగినీడు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.