ఆసక్తిని రేపుతున్న ప్రభుదేవా ఫస్టు లుక్!
- ప్రభుదేవా నుంచి 54వ చిత్రం
- కీలకపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్
- 40 శాతం షూటింగు పూర్తి
- డిసెంబర్లో విడుదల
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభుదేవా కృత్రిమ కాలుతో కనిపిస్తున్నాడు. ఒక చేత్తో ఒక పాపను ఎత్తుకుని ఉన్న ఆయన, మరో చేత్తో ఒక ఇనుప ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు. శత్రువుల బారి నుంచి ఆ పాపను కాపాడే ప్రయత్నంలో ఆయన ఉన్నాడనే విషయం అర్థమవుతోంది.
కెరియర్ పరంగా ప్రభుదేవాకి ఇది 54వ సినిమా. రైజా విల్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ - సముద్రఖని కనిపించనున్నారు. ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.