సంక్రాంతికి 'ఎఫ్ 3' రావడం ఖాయమే!
- 'నారప్ప' హిట్ పట్ల వెంకీ హ్యాపీ
- ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన వైనం
- 'ఎఫ్ 3' థియేటర్లకే వస్తుంది
- సంక్రాంతికి సందడి చేద్దామన్న వెంకటేశ్
పరిస్థితులు అనుకూలించిన తరువాత ఇటీవలే మళ్లీ షూటింగును మొదలుపెట్టారు. అయితే షూటింగు విషయంలో జాప్యం జరిగిన కారణంగా ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లకు రాకపోవచ్చుననే ఒక ప్రచారం జరుగుతోంది. తాజాగా వెంకటేశ్ మాట్లాడుతూ, ఆ ప్రచారానికి తెరదించారు.
నిన్న సాయంత్రం జరిగిన 'నారప్ప' సినిమా సక్సెస్ మీట్ లో వెంకటేశ్ మాట్లాడారు. 'నారప్ప' .. థియేటర్లలో రానందుకు అభిమానులు బాధపడొద్దనీ, 'ఎఫ్ 3' సినిమా సంక్రాంతికి థియేటర్లలోనే వస్తుందని అన్నారు. అప్పుడు అందరం కలిసి సందడి చేద్దాం అని చెప్పారు. దాంతో ఆయన ఈ సినిమా సంక్రాంతికి రావడం ఖాయమేననే విషయాన్ని స్పష్టం చేసినట్టు అయింది.