మళ్లీ ముంచుకొస్తున్న మహమ్మారి.. కేరళ, తమిళనాడులో భారీగా కేసులు
- కేరళలో వరుసగా నాలుగో రోజూ 20 వేలకు పైనే కొత్త కేసులు
- 13.61 శాతంగా పాజిటివిటీ రేటు
- ఆగస్టు 8వ తేదీ వరకు తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు
మరోవైపు, తమిళనాడులోనూ కేసులు స్వల్పంగా పెరగడంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగించింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉండడంతో ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగొద్దని హెచ్చరించింది. అనుమతించిన దానికంటే ఎక్కువమంది గుమికూడిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో నిన్న 24 గంటల వ్యవధిలో 1859 కేసులు నమోదు కాగా, 28 మంది మరణించారు. 21,207 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.23 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశారు. 40 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్టు అధికారులు తెలిపారు.