'లక్ష్య' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్!
- నాగశౌర్య నుంచి 'లక్ష్య'
- కథానాయికగా కేతిక శర్మ
- కీలక పాత్రలో జగపతిబాబు
- త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం కావడంతో, ఇకపై ప్రతి శుక్రవారం ఒక అప్డేట్ ఉంటుందంటూ ఇటీవల నాగశౌర్య చెప్పాడు. అన్నట్టుగానే ఆయన ఈ రోజున ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త పోస్టర్ ను వదిలాడు. హీరో హీరోయిన్లు ప్రేమమైకంలో మునిగితేలుతున్న పోస్టర్ ఇది.
విలువిద్య నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నాగశౌర్య సిక్స్ ప్యాక్ తో .. కొత్త లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఓ కీలకమైన పాత్రను పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాకి అదనపు బలంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.