తమిళ యంగ్ హీరో సరసన రష్మిక!
- తెలుగులో రెండు సినిమాలలో రష్మిక
- హిందీలో మరో రెండు సినిమాలు
- శివకార్తికేయన్ సినిమాలో అవకాశం
- 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వం
ఇదే సమయంలో ఈ చిన్నది కోలీవుడ్ మీద కూడా దృష్టి పెట్టింది. ఆమధ్య కార్తీ హీరోగా రూపొందిన 'సుల్తాన్' చిత్రంలో నటించిన రష్మిక త్వరలో మరో తమిళ సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'జాతిరత్నాలు' చిత్రంతో పేరుతెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం రష్మికను అడుగుతున్నారట. పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.