పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర సుంకాన్ని ఎందుకు తగ్గించడం లేదు జగన్ గారు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- పెట్రోల్, డీజిల్ కేంద్ర పరిధిలోని అంశాలని అంటున్నారు
- రాష్ట్ర సుంకాన్ని తగ్గించడం మీ చేతిలోనే ఉంది కదా?
- మీ పప్పు, బెల్లాలు పంచడానికి ఆదాయం కావాలి
పెట్రోల్, డీజిల్ కేంద్ర పరిధిలోని అంశాలని అంటున్నారని... మరి వీటిపై ఉన్న రాష్ట్ర సుంకాన్ని ఎందుకు తగ్గించరు ముఖ్యమంత్రి జగన్ గారూ? అని గోరంట్ల ప్రశ్నించారు. రాష్ట్ర సుంకాన్ని తగ్గించడం మీ చేతిలోనే ఉంది కదా? అని అన్నారు. మీ పప్పు, బెల్లాలు పంచడానికి ఆదాయం కావాలి అని ఎద్దేవా చేశారు. ఇష్టానుసారంగా ధరలు పెంచడం... పేదలకు ఇస్తున్నట్టు మాటలు చెప్పడం మీకే చెల్లిందని విమర్శించారు.