రాజమౌళి కోసం అనిరుధ్ ప్రమోషనల్ సాంగ్?
- ప్రస్తుతం అందరి కళ్లూ 'ఆర్ఆర్ఆర్' పైనే!
- ముగింపు దశకి చేరిన సినిమా షూటింగ్
- ప్రమోషనల్ సాంగ్ కోసం ప్రత్యేక సెట్స్
సాధారణంగా రాజమౌళి చిత్రాలకు ఆయన సోదరుడు కీరవాణి పనిచేస్తుంటారు. అలాగే ఈ 'ఆర్ఆర్ఆర్'కి కూడా ఆయనే సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే, సినిమా ప్రమోషన్ కు సంబంధించిన ఒక పాటను ఇప్పుడు స్పెషల్ గా చేయించాలని నిర్ణయించారట. దానిని యువ సంగీత దర్శకుడితో చేయిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అనిరుధ్ తో చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ పాటను ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ లతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై భారీ సెట్స్ పై చిత్రీకరించడానికి కూడా మరోపక్క ఏర్పాట్లు చేస్తున్నారట.