'ఖిలాడి' షూటింగుకు బ్రేక్ పడిందట!
- చివరిదశలో 'ఖిలాడి'
- రవితేజలో అసహనం
- షూటింగుకు తాత్కాలిక బ్రేక్
- సెట్ చేసేందుకు ప్రయత్నాలు
'ఖిలాడి' కోసం తాను ముందుగా ఇచ్చిన డేట్స్ పూర్తికావడంతో, రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సెట్స్ పైకి వెళ్లిపోయాడని చెప్పుకుంటున్నారు. రవితేజతో మాట్లాడి .. మిగతా షూటింగును కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో 'ఖిలాడి' దర్శక నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఇక శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ'పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. 'ఖిలాడి'లో మాదిరిగానే ఈ సినిమాలోను ఇద్దరు హీరోయిన్లు అందాల సందడి చేయనున్నారు.