బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవిని ఇచ్చిన జగన్
- ఈరోజు నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
- బైరెడ్డికి మంచి పోస్టు ఇస్తానని గతంలోనే చెప్పిన జగన్
పాదయాత్ర సమయంలో జగన్ మాట్లాడుతూ తన మనసులో బైరెడ్డి ఉన్నాడని, కచ్చితంగా మంచి ప్రాధాన్యత ఉన్న పోస్టును ఇస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా... ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమించారు. మరోవైపు బైరెడ్డి పేరును ప్రకటించగానే బైరెడ్డి ఇంటి వద్ద పార్టీ ఆఫీసు వద్ద సందడి నెలకొంది. ఆయన అనుచరులు స్వీట్లు పంచుకున్నారు. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.