'ఐస్ క్రీమ్ 3' కోసం రెడీ అవుతున్న వర్మ!
- వర్మ నుంచి 'ఐస్ క్రీమ్' కథలు
- రొమాన్స్ ప్రధానంగా సాగిన సినిమాలు
- మరో సినిమాకు సన్నాహాలు
- త్వరలోనే పూర్తి వివరాలు
వర్మ దర్శకత్వంలో 2014లో వచ్చిన 'ఐస్ క్రీమ్' సినిమా, యూత్ ను ఓ మాదిరిగా ఆకట్టుకుంది. నవదీప్ - తేజస్వి - మృదుల ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆ తరువాత కొంత గ్యాప్ తోనే వర్మ 'ఐస్ క్రీమ్ 2' సినిమాను రిలీజ్ చేశాడు. జేడీ చక్రవర్తి .. నవీన .. నందు .. గాయత్రి గుప్తా ప్రధానమైన పాత్రలలో కనిపించారు. ఈ సినిమా కూడా ఓ మాదిరిగానే ఉందని చెప్పుకున్నారు. ఈ రెండు సినిమాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణతో కలిసి, వర్మ ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నటీనటులు .. సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడిస్తారట.