టీఆర్ఎస్‌లోకి కౌశిక్‌రెడ్డి.. ముహూర్తం ఫిక్స్!
- ఈ నెల 21న కేసీఆర్ సమక్షంలో చేరిక
- టీఆర్ఎస్ హుజూరాబాద్ టికెట్ తనకేనంటూ ఇటీవల కౌశిక్ ఆడియో
- పార్టీకి రాజీనామా చేస్తూ రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు
తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమంటూ ఆయన వ్యాఖ్యల ఆడియో లీకైన తర్వాత కలకలం రేగింది. అనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి అధ్యక్ష పదవి కొనుక్కున్నారని ఆరోపించి కలకలం రేపారు.