టి-సిరీస్ మ్యూజిక్ కంపెనీ అధినేత భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన మోడల్
- ఉద్యోగం పేరిట అత్యాచారం చేశాడని వెల్లడి
- కేసు నమోదు చేసిన పోలీసులు
- తప్పుడు ఆరోపణలంటూ ఖండించిన టి-సిరీస్
మోడల్ ఫిర్యాదు నేపథ్యంలో ముంబయిలోని అంధేరీ (వెస్ట్) పోలీసులు కేసు నమోదు చేశారు. టి-సిరీస్ మ్యూజిక్ కంపెనీ అధినేత భూషణ్ కుమార్ ను వివరణ కోరాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మోడల్ ఆరోపణలను టి-సిరీస్ వర్గాలు ఖండించాయి. అవి తప్పుడు ఉద్దేశాలతో చేసిన ఆరోపణలని కొట్టిపారేశాయి. తాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.