ప్రియాంక చోప్రా పెళ్లి పెటాకులవుతుందన్న సినీ క్రిటిక్... తిట్టిపోస్తున్న నెటిజన్లు
- కమాల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలు
- పదేళ్లలో ప్రియాంక, నిక్ విడాకులు తీసుకుంటారని వెల్లడి
- కరీనా పిల్లలు తారలుగా రాణించలేరని వివరణ
- ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
తాజాగా, ప్రియాంక చోప్రాపై అతడు చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించాయి. మరో పదేళ్లలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల కాపురం విచ్ఛిన్నం అవుతుందని, వారు విడాకులు తీసుకోవడం ఖాయమని కేఆర్కే వెల్లడించాడు. దాంతో నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా ఆ సినీ క్రిటిక్ పై తమ ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు.
కేఆర్కే పైత్యం అంతటితో ఆగలేదు... కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ సంతానంపైనా తన జోస్యం వెల్లడించాడు. కరీనా, సైఫ్ పిల్లలు తైమూర్, జే భవిష్యత్తులో నటులుగా ఏమాత్రం రాణించలేరని పేర్కొన్నాడు. వారి పేర్లలోనే తప్పు ఉందని, అందుకే వారు సినీ రంగంలో ఎదగలేరని వివరించాడు.