హీరోగా నటించనున్న బండ్ల గణేశ్?
- హాస్య నటుడిగా గుర్తింపు
- భారీ చిత్రాల నిర్మాతగా పేరు
- మళ్లీ నటన వైపుకు అంటూ టాక్
- కథ వినిపించిన కొత్త దర్శకుడు
తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'మండేలా' తెలుగు రీమేక్ లో బండ్ల గణేశ్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇక ఇప్పుడు మళ్లీ అలాంటి టాక్ ఒకటి బలంగానే వినిపిస్తోంది. వెంకట్ అనే ఒక కొత్త దర్శకుడు ఒక కథను తయారుచేసుకున్నాడట. పూర్తి వినోదభరితంగా సాగే ఈ కథలో, ప్రధాన పాత్రను బండ్ల గణేశ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.