నాగార్జున బ్యానర్లో మెగా హీరో.. భారీ పారితోషికం!
- 'ఉప్పెన'తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్
- పలువురు నిర్మాతల నుంచి ఆఫర్లు
- ఆచితూచి ఒప్పుకుంటున్న వైష్ణవ్
- నాగార్జున బ్యానర్లో స్పోర్ట్స్ సినిమా
ఈ క్రమంలో ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' అనే చిత్రాన్ని చేసిన వైష్ణవ్.. తాజాగా అక్కినేని నాగార్జున బ్యానర్ అన్నపూర్ణ స్థూడియోస్ నిర్మించే సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని అంటున్నారు. ఇందులో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపిస్తాడట.
ఈ చిత్రం ద్వారా పృథ్వీ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను వైష్ణవ్ కు నాగార్జున ఐదు కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.