'ఉప్పెన' హీరోతో సురేందర్ రెడ్డి!
- 'ఉప్పెన' హిట్ తో క్రేజ్
- అన్నపూర్ణ బ్యానర్లో సినిమా
- లైన్లో సురేందర్ రెడ్డి
- దశరథ్ అందించిన కథ
భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, 'సంతోషం' .. 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాల దర్శకుడు దశరథ్ కథను అందించడం విశేషం. రచయితగా మంచి అనుభవం ఉన్న దశరథ్ అల్లిన కథ కావడంతో అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి వదిలిన అఖిల్ లుక్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఆయన సాక్షి వైద్యాను కథానాయికగా పరిచయం చేయనున్నాడు. ఈ సినిమా తరువాతనే ఆయన వైష్ణవ్ తేజ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.