కేసీఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదు: టీజీ వెంకటేశ్
- కరోనా వల్ల కేసీఆర్ కు మెదడు దెబ్బతింది
- నీటి ఒప్పందాలను ఆయన మర్చిపోయారు
- జల వివాదాలు సివిల్ వార్ కు దారి తీస్తాయి
జల వివాదాలు సివిల్ వార్ కు దారి తీస్తాయని టీజీ వెంకటేశ్ చెప్పారు. కేసీఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదన అన్నారు. ఏపీ ఓట్లు తెలంగాణలో ఉన్నాయి తప్ప... తెలంగాణ ఓట్లు ఏపీలో లేవని చెప్పారు. కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తారని... హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఆంధ్ర పాట, కరీంనగర్ ఎన్నికలప్పుడు తెలంగాణ పాట పాడతారని విమర్శించారు. ఏపీ పోలీసులు యాక్షన్ తీసుకుని శ్రీశైలం డ్యామ్ ను స్వాధీనం చేసుకోవాలని అన్నారు.