శివాజీరాజాను ఈ విధంగా చూసి "ఆయనకు ఏమైంది?" అంటున్న అభిమానులు!
- గతేడాది గుండెపోటుకు గురైన శివాజీరాజా
- అప్పటినుంచి మీడియాకు దూరం
- శివాజీరాజా తనయుడు హీరోగా ఎంట్రీ
- పాట విడుదల కార్యక్రమంలో కనిపించిన శివాజీరాజా
- బక్కచిక్కి కనిపించిన నటుడు
శివాజీరాజా 2020లో గుండెపోటుకు గురయ్యారు. అప్పటినుంచి ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారు. తాజాగా తన కుమారుడు వినయ్ రాజా నటిస్తున్న వేయి శుభములు కలుగునీకు చిత్రం నుంచి ఓ పాట విడుదల చేస్తుండగా, ఓ కార్యక్రమంలో శివాజీరాజా బలహీనంగా కనిపించారు. దీనిపై ఆయన సన్నిహితులు వివరణ ఇచ్చారు. గుండెపోటుకు గురయ్యాక చికిత్స పొందారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.