ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవి... మాపై మాట్లాడే హక్కు లేదు: రేవంత్ పై సుధీర్ రెడ్డి ఫైర్
- పార్టీ ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలన్న రేవంత్
- మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన సుధీర్ రెడ్డి
- రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నామని వెల్లడి
- రేవంత్ వి స్వార్థరాజకీయాలని విమర్శలు
ఆయనవి స్వార్థ రాజకీయాలని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. తాము రాజ్యాంగం ప్రకారమే టీఆర్ఎస్ లో విలీనం అయ్యామని సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా పాల్గొన్నారు.