హైలైట్ గా నిలవనున్న పవన్ .. రానా యాక్షన్ ఎపిసోడ్!
- మలయాళ రీమేక్ లో పవన్ - రానా
- 40 శాతం చిత్రీకరణ పూర్తి
- ఈ నెల 11 నుంచి మేజర్ షెడ్యూల్
- ఆగస్టు చివరికి పూర్తి చేసే ఆలోచన
హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ వేశారట. ఈ సెట్ లో పవన్ .. రానా కాంబినేషన్లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండగా, ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పవన్ సరసన నిత్యామీనన్ .. రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.