'అసురన్' నిర్మాత బ్యానర్లో అల్లు అర్జున్!
- షూటింగు దశలో 'పుష్ప'
- నెక్స్ట్ మూవీ 'ఐకాన్' అంటూ టాక్
- తెరపైకి మురుగదాస్ పేరు
అయితే తమిళంలో నిర్మాతగా కలైపులి థాను బ్యానర్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన బ్యానర్లో స్టార్ హీరోల సినిమాలు వరుసగా రూపొందుతూ ఉంటాయి. విజయ్ వంటి స్టార్ హీరోలతో ఆయన నిర్మించిన భారీ సినిమాలు తెలుగులోను ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ చర్చలు కార్యరూపాన్ని దాల్చుతాయని భావిస్తున్నాను" అన్నారు. దాంతో ఇది మురుగదాస్ ప్రాజెక్టు కోసమేనని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన మురుగదాస్ తో 'తుపాకి' .. 'పోలీసోడు' సినిమాలు చేశారు.