రంగంలోకి దిగిపోయిన 'ఎఫ్ 3' టీమ్!
- కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్
- ఈ రోజున మళ్లీ సెట్స్ పైకి వెళ్లిన టీమ్
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
మళ్లీ ఇన్నిరోజుల తరువాత ఈ రోజున ఈ సినిమా షూటింగు మొదలైంది. ముఖ్యమైన పాత్రధారులపై 10 రోజుల పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. ఎక్కువ డబ్బు సంపాదించమని భార్యలు పెట్టే పోరును తట్టుకోలేని భర్తల చుట్టూ ఈ కథ తిరుగుతుందట. 'ఎఫ్ 2'కు మించి ఈ సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పడం వలన, మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.