దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే: సినీ నటుడు సుమన్
- మా ఎన్నికల్లో తెరపైకి నాన్ లోకల్ అంశం
- ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంటున్న ప్రత్యర్థులు
- రైతులు నాన్ లోకల్ అనుకుంటే ఆహారం కూడా దొరకదన్న సుమన్
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. ఈ సందర్భంగానే మా ఎన్నికల గురించి ఆయన స్పందించారు. అందరూ కలసికట్టుగా ఉండాలని... లోకల్, నాన్ లోకల్ అనే భావన వద్దని సూచించారు.