Teja sajja: ఫాంటసీ లవ్ స్టోరీకి టైటిల్ ఖరారు!

- తేజ సజ్జ జోడీగా శివాని రాజశేఖర్
- ఫాంటసీ నేపథ్యంలో సాగే ప్రేమకథ
- సంగీత దర్శకుడిగా రధన్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన యువ కథానాయకులలో తేజ సజ్జ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'జాంబి రెడ్డి' సినిమా హిట్ తో ఈ కుర్రాడు దార్లో పడిపోయాడు. 'ఇష్క్ .. నాట్ ఎ లవ్ స్టోరీ' సినిమా విడుదలకి సరైన సమయం కోసం చూస్తోంది. ప్రశాంత వర్మ దర్శకత్వంలోనే ఈ కుర్రాడు 'హనుమాన్' కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకంటే ముందుగానే మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడి సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా శివాని రాజశేఖర్ నటించింది.
