రాహుల్ గాంధీ విషయంలో తప్పు చేసి కాంగ్రెస్ కు దూరమయ్యా: కన్నడ సినీ నటి రమ్య
- గతంలో మాండ్య ఎంపీగా ఉన్న రమ్య
- కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జ్ గానూ బాధ్యతలు
- పార్టీకి దూరమైన కారణాన్ని మాత్రం చెప్పని రమ్య
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, 'దివ్య స్పందన' పేరిట ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన ఆమె, కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ, వార్తల్లో నిలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేశారు. అయితే, తను రాహుల్ విషయంలో చేసిన తప్పేంటన్న విషయాన్ని మాత్రం రమ్య వెల్లడించక పోవడం గమనార్హం.