శ్రీను వైట్లకు అఖిల్ గ్రీన్ సిగ్నల్?
- విడుదలకు సిద్ధంగా 'బ్యాచ్ లర్'
- వచ్చేనెల నుంచి 'ఏజెంట్' రెగ్యులర్ షూటింగ్
- శ్రీను వైట్ల నుంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్
ఇక ఈ నేపథ్యంలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నట్టుగా తాజాగా ఒక వార్త షికారు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారని చెప్పుకుంటున్నారు. శ్రీను వైట్ల చెప్పిన కథ మైత్రీవారికి నచ్చిందని అంటున్నారు. ఇక అఖిల్ కి కథను వినిపించవలసి ఉందని చెబుతున్నారు. మైత్రీవారు ఆల్రెడీ అఖిల్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారనీ .. ఈ ప్రాజెక్టు ఆయన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.