దూకుడు పెంచుతున్న 'దొరసాని'
- 'దొరసాని' సినిమాతో మంచి పేరు
- 'రంగమార్తాండ'లోను ఛాన్స్
- తమిళంలో రెండు సినిమాలు
అలాంటి శివాత్మిక 'రంగమార్తాండ' సినిమాతోనే మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. అయితే తమిళంలో ఆమె తన దూకుడు పెంచాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తమిళంలో ఆమె 'ఆనందం విలయాడుమ్ వీడు' అనే సినిమా చేసింది. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కాకముందే శివాత్మిక మరో తమిళ సినిమాకి సైన్ చేసిందని అంటున్నారు. ఆర్. కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. ఇక తమిళంలో ఆమె మరికొన్ని కథలను వింటున్నట్టుగా చెబుతున్నారు.