ఏపీలో పరిషత్ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే
- ఇటీవల పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పు
- డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఎస్ఈసీ
- రిట్ పిటిషన్ దాఖలు
- నేడు విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్
- విచారణ జులై 27కి వాయిదా
పరిషత్ ఎన్నికల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందని ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని స్పష్టం చేసింది. కాగా, విచారణ సందర్భంగా.... అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే తాము ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్ కు నివేదించారు.