నయనతారను ఎదుర్కునే విలన్ గా సుదీప్!
- వరుస సినిమాలతో నయన్ బిజీ
- తాజా చిత్రంగా రానున్న 'నేత్రికన్'
- విలన్ పాత్రలో సుదీప్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
ఒక నూతన దర్శకుడు వినిపించిన ఈ కథ నచ్చడంతో నయనతార వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. డ్రీమ్ వారియర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్ర కోసం సుదీప్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. కన్నడలో సుదీప్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు.